రాష్ట్రీయం

కేటాయంపులు మిగల్చొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ప్రస్తుత బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టడంతోపాటు కేంద్ర నుంచి పొందిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని శాఖాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత బడ్జెట్‌లో జరిగిన ఆదాయ, వ్యయాలను అనుసరించే వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పన ఆధారపడి ఉంటుందని సూచించింది. బడ్జెట్‌లో ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాలు, కేంద్ర నిధుల వినియోగం, వచ్చే ఏడాది రూపొందించనున్న బడ్జెట్‌పై సచివాలయంలో సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చర్చించారు. దీంట్లో ప్రధానంగా వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనలపైనా శాఖాధిపతులకు మంత్రి, సిఎస్ సంకేతాలు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి వేగంవంతం చేయడానికి వచ్చే బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే నీటిపారుదలకు కేటాయించిన ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 వేల కోట్ల మేరకు పనులు జరగాల్సిందేనని, వచ్చే బడ్జెట్‌లోనూ ఇంతే మొత్తంలో నిధులు కేటాయించనుండటంతో ఈసారి కేటాయింపులను పూర్తిగా ఖర్చు పెట్టాలని సూచించినట్టు తెలిసింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు ఖర్చు చేయడంతో పాటు వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనలపై పూర్తి అవగాహన ఉండాలని రాజీవ్ శర్మ సూచించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయానికంటే ప్రణాళిక వ్యయానికి ఎక్కువ నిధులు కేటాయించినట్టుగానే వచ్చే బడ్జెట్‌లో అదే విధానాన్ని అనుసరించనున్నట్టు సిఎస్ సంకేతాలిచ్చారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే ఉహించని విధంగా ఆదాయం పెరిగిన నేపథ్యంలో ప్రణాళిక వ్యయం వచ్చే ఏడాది బడ్జెట్‌లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల భవనాలు నిర్మాణానికి ప్రతిపాదనలు అందితే వాటికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్టు సూచించారు. పంట రుణ మాఫీ వాయిదాతో ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఆర్థిక మంత్రి ఈటల ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి నిధులు ప్రస్తుతానికంటే ఎక్కువ పెంచుతూనే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రాధాన్యతా, ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసేలా వచ్చే ఆర్థిక బడ్జెట్ ఉండబోతుందని సూచనప్రాయంగా శాఖాధిపతులకు వెల్లడించినట్టు తెలిసింది.