రాష్ట్రీయం

సచివాలయాన్ని కూల్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: సచివాలయాన్ని కూల్చవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యంలో సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రైతుల రుణ మాఫీ, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో నిధులు లేవంటూ జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయాన్ని కూల్చి వేసి మళ్లీ నిర్మించడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుందని వారు గవర్నర్‌కు తెలిపారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వాస్తు బాగా లేదన్న వంకతో మంచిగా, పటిష్టంగా ఉన్న సచివాలయంలోని భవనాలను కూల్చి వేయడం దుర్మార్గమని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కొన్ని బ్లాకులను కూల్చి వేసి, పటిష్టంగా నిర్మించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపికి కేటాయించిన భవనాలూ ఖాళీ అయిన తర్వాత మరింత విశాలంగా వాడుకోవడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాబట్టి భవనాలను కూల్చి వేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.
కెసిఆర్‌కు హరీష్ భయం..
ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు కె. తారక రామారావును ముఖ్యమంత్రి చేయడానికి వీలుగా వాస్తు పేరిట సచివాలయంలోని భవనాలను కూల్చి వేయించి, మళ్లీ నిర్మించాలనుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లు మేనల్లుడు హరీష్ రావు సిఎం అవుతారేమోనన్న భయం కెసిఆర్‌కు పట్టుకున్నదని ఆయన అన్నారు.

చిత్రం.. గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న టి.పిసిసి నేత ఉత్తమ్ కుమార్