రాష్ట్రీయం

బాబు వాదనలో పసలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును రద్దు చేయాలని, కొట్టి వేయాలన్న నిబంధన చట్టంలో లేదని ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది పి సుధాకర్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మంగళవారం హైకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ సునీల్ చౌదరి విచారించారు. ఏసిబి కోర్టు ఈ కేసుపై మళ్లీవిచారించాలని ఇచ్చిన ఆదేశాలపై సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఏసిబి శాఖ ఒక సారి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత తాజాగా మరో ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాల్సిన పనిలేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరపున న్యాయవాది చేసిన వాదనలో పసలేదని వైకాపా తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసుపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.