ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 8: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్న భక్తుల కారుపై ఘాట్‌రోడ్డులోని హరిణి మలుపు వద్ద సుమారు 20 కేజీల బరువు కలిగిన బండరాయి దొర్లి పడింది. అదృష్టవశాత్తూ ఈసంఘటనలో భక్తులకు ఎలాంటి ప్రమాదం కలుగలేదు. అయితే బండరాయి 40 అడుగుల ఎత్తునుంచి దొర్లుకుంటూ పడటంతో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన హేమంత్‌కుమార్ మాట్లాడుతూ ఆ భగవంతుడి దయతోనే తాము ప్రమాదంనుంచి తప్పించుకున్నామని అన్నారు. సర్వసాధారణంగా భారీ వర్షాలు కురిసినపుడు రెండో ఘాట్‌రోడ్డులో కొండ చరియలు జారిపడుతూ ఉంటాయి. అయితే మంగళవారం వర్షం, గాలి లేకపోయినా బండ జారిపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇలాంటి బండరాళ్లను గుర్తించి వాటిని తొలగించాల్సిన బాధ్యతపై టిటిడి ఇంజనీరింగ్ అధికారులు దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.