ఆంధ్రప్రదేశ్‌

1400 ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్‌టిఆర్ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 8: రాష్టవ్య్రాప్తంగా 1400 ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్‌టిఆర్ వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రైవేట్ వైద్యంపై మోజుతో ప్రభుత్వ వైద్యంపై అలసత్వం వహించే వైద్యులు, సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని అన్నారు.
సెలవుపెడితే ఇంటికి పంపుతామని మంత్రి హెచ్చరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1.10 కోట్లతో ఏర్పాటుచేసిన డయాలసిస్ యూనిట్‌ను మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాస్‌తో కలిసి కామినేని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సలు అందజేస్తున్నామన్నారు. తల్లీబడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా వారి ఇంటికి చేరుస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ వైద్యశాల అంటే ప్రజలు వెనుకంజ వేసేవారని, అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన చర్యల వల్ల ప్రజలు వైద్యం కోసం ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే, సొంత క్లినిక్‌లకు పరిమితమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్ వైద్యసేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని మంత్రి అన్నారు. జబ్బులకు వివిధ రకాల పరీక్షలు, సిటీ స్కానింగ్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలన్నీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక జబ్బులు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా తదితర ప్రాణాంతక జబ్బులకు ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా 24 గంటల ఆసుపత్రి, మొబైల్ ఆసుపత్రులు, నియోజకవర్గ, జిల్లా ఆసుపత్రుల్లో నిత్యం వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రతి వైద్యుడికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉంటాడన్నారు. అవసరం మేరకు డాక్టర్లు, సిబ్బందిని నియమించామన్నారు.