ఆంధ్రప్రదేశ్‌

ఆధార్‌తో అనుసంధానంతోనే ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో నూరు శాతం ఆధార్ సంఖ్యతో కూడి లబ్ధిదారులు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన మధ్యప్రదేశ్ సాంకేతిక బృందాల సభ్యులతో ఆయన స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎరువుల పంపిణీ, మండల స్టాక్ పాయింట్‌లో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విధానంపై ఏమైనా సందేహాలు ఉంటే అడగాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా 2011లో తూర్పు గోదావరి జిల్లాలో 100 చౌకధరల దుకాణాలలో అమలుచేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తి స్థాయిలో వాస్తవ లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని సూచించిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 2015, జూన్ నుండి పూర్తి స్థాయిలో అమలు చేశామన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఆధార్ సంఖ్యను రేషన్ కార్డు సంఖ్యతో, అందులోని కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేశామన్నారు. మిగిలిన లబ్ధిదారులను క్షేత్ర స్థాయిలో అవగాహన పెంచడం ద్వారా సరకులు తీసుకెళ్ళే సందర్భంలోనే వారి ఆధార్ సంఖ్యను తీసుకుని ఇ-పోస్ మిషన్ ద్వారా అనుసంధానం చేశామన్నారు. ఈ ప్రక్రియ వల్ల ఒక్క రాష్ట్రంలోనే 9 లక్షల, 58 వేల, 533 బినామి కార్డులను, కృష్ణా జిల్లాలో 26 వేల, 603 బినామీ కార్డులను తొలగించగలిగామన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 13 వందల కోట్లు మేర లబ్ధి చేకూర్చగలిగామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రజాసాధికారిత సర్వే నిర్వహిస్తున్నామని, ఇంటింటి సర్వేలో భాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులను గుర్తించడం ద్వారా తదుపరి ప్రక్రియలో రేషన్‌కార్డు లేని లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.
ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ జామ్ ఆధారంగా రాష్ట్రంలో 13 జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆహార, జాతీయ, ఇన్ఫరమెంట్ కేంద్ర తదితర శాఖల ప్రతినిధి బృంద సభ్యులు జాయింట్ డైరెక్టర్ హెచ్‌ఎస్ పరమార్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్లు బార్తి ఓగ్రి, అభయ్ బేడేకర్, ఎన్‌ఐసి ప్రతినిధులు సునీల్ జైన్, అబ్రహామ్ వేర్జెస్, అజయ్ కులకర్ణి, నారాయణ యాదవ్, అనిల్ ఠాకూర్, మనిష్, ముఖేష్‌సింగ్, అనిఫ్ షికా, నవీన్ గార్గ్‌తోపాటు జిల్లా అధికారులు డిఎస్‌వో వి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.