ఆంధ్రప్రదేశ్‌

వస్తు తయారీ రంగంలోనే ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: వస్తుతయారీ రంగంలోనే విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని, పారిశ్రామికాభివృద్ధి ద్వారానే అది సాధ్యమని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఎస్‌ఎస్‌భండారే అభిప్రాయపడ్డారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై ఫోరం ఆఫ్ ఫ్రీ ఎంటర్‌ప్రైస్, గీతం గీతం యూనివర్శిటీ సంయుక్తంగా విశాఖలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారే మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉత్తత్తి గణనీయంగా తగ్గుతున్న తరుణంలో యువతకు ఉపాధి కల్పన కష్టతరమైందన్నారు. ప్రపంచం మొత్తంగా చూస్తే అత్యధిక శాతం యువతరం కలిగిన భారత్‌లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పెద్ద సవాలుగా మారుతోందన్నారు.
రానున్న 25 సంవత్సరాల్లో సుమారు దాదాపు 300 మిలియన్ యువతకు ప్రభుత్వాలు ఉపాధి కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో వస్తు తయారీ రంగంలో మాత్రమే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఆటోమోబైల్ పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని, పారిశ్రామిక అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంచి అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. రెండు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ తరహాలోనే అన్ని జిల్లాలు అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఈ కారిడార్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఓడరేవులు, జాతీయ రహదారులతో అనుసంధానం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఉపకరిస్తుందన్నారు.
రైలు, రోడ్డు మార్గాలు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేస్తాయని, తద్వారా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. షిప్పింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ వల్ల ఔషధ పరిశ్రల అభివృద్ధికి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎస్‌ఎస్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వి పద్మనాభం మాట్లాడుతూ కారిడార్ ఏర్పాటు ద్వారా మత్స్య సంపదతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు అంతర్జాతీయ మార్కెటింగ్ చేసుకునేందుకు ఎంతగానో మేలుచేకూరుతుందన్నారు. గీతం యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు కార్యక్రమానికి సారధ్యం వహించారు.