ఆంధ్రప్రదేశ్‌

హోటళ్లలో అవినీతిపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తిరుమలలో రెస్టారెంట్లు, హోటళ్ల పనితీరు, ఎక్కువ రేట్లకు తినుబండారాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారి ఇచ్చిన నివేదికను సమర్పించాలని హైకోర్టు మంగళవారం టిటిడి దేవస్థానాన్ని ఆదేశించింది. తిరుమలలో హోటళ్ల యాజమాన్యం అధిక రేట్లను వసూలు చేస్తున్న అంశాలపై దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. హోటళ్ల పరిస్థితిపై విజిలెన్స్ నివేదిక అందుబాటులో లేని పక్షంలో టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి లిఖితపూర్వక ప్రకటనను రాసి హైకోర్టు సమర్పించాలని ఆదేశించారు. తిరుపతిలో కంటే తిరుమలలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం ఐదువందల శాతం ఎక్కువగా రేట్లను వసూలు చేస్తున్నారని పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. టిటిడి, హోటల్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఒప్పందంలో ప్రస్తావించిన రేట్లు మాత్రమే వసూలు చేయాలని అలాగే హోటల్ బయట వివిధ తినుబండారాల రేట్లు ప్రదర్శించాల్సి ఉంటుందని పిల్‌లో కోరారు. హోటళ్లు అధిక రేట్లను వసూలు చేయడంపై 2010లో విజిలెన్స్ శాఖ ఒక నివేదికను రూపొందించిందని, దాని ఆధారంగా, ఎక్కువ రేట్లకు తినుబండారాలను విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరినా ప్రయోజనం లేదన్నారు. ఈ సందర్భంగా టిటిడి తరపున ప్రత్యేక న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఈ ఏడాది జూన్‌లో పిటిషనర్ ఈ వ్యవహారాలను టిటిడి దృష్టికి తెచ్చారని, ఈ అంశాలను టిటిడి పరిశీలిస్తోందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని విజిలెన్స్ నివేదిక గురించి అడిగింది. టిటిడి దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లనున్నట్లు న్యాయవాది తెలిపారు. ఈ నివేదిక అందుబాటులో ఉంటే వచ్చే మంగళవారానికి హైకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.