రాష్ట్రీయం

డిఎస్పీల పదోన్నతులపై నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: డిఎస్పీ పదోన్నతులపై నివేదిక ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. డైరెక్ట్‌గా, పదోన్నతులుగా డిఎస్పీలుగా నియమితులైన అధికారుల సీనియారిటీ జాబితాను రూపొందించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసును నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.
ఓటుకు నోటు కేసు విచారణ
ఓటుకు నోటు కేసుపై హైకోర్టు బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది పి సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ టి సునీల్ చౌదరి పిటిషనర్ న్యాయవాదిని పలు ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో కొంతమందిపై చార్జిషీటుదాఖలైందని, ఒక నిందితుడిపైన కేసు విచారణ పెండింగ్‌లో ఉందని, ఈ నేపథ్యంలో ఏసిబి కోర్టు దర్యాప్తుపై తాజా ఆదేశాలు ఎలా ఇస్తుందో వివరించాలని హైకోర్టు అడిగింది. అనంతరం పిటిషనర్ తరఫునన్యాయవాది తన వాదనలు ముగిసినట్లు చెప్పారు. ఈ కేసులో ఏసిబి తన వాదనలను ఈ నెల 14వ తేదీన వినిపిస్తుంది.