ఆంధ్రప్రదేశ్‌

నకిలీ నోట్లపై సర్జికల్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 10: నోట్ల రద్దు ఘనతను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకుంటానంటే తమకు అభ్యంతరమేమీ లేదని బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. విజయవాడలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి సిఎం లేఖ రాయడంపై అడిగిన ప్రశ్నకు ఆయ న స్పందిస్తూ ఇందుకు సంబంధించిన ఘనత ఎవరైనా సొంతం చేసుకోవచ్చని, ఇది జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశమని, తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. నల్లధనం నియంత్రణకు ప్రధాని చర్యలు ప్రారంభించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడాన్ని ప్రస్తావించగా, జాతీయంగా కీలకమైన అంశమని, తాము దానిని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నల్లధనం, నకిలీ నోట్ల చెలామణిపై సర్జికల్ దాడి చేశారని అభివర్ణించారు. దీనిని కూడా ఉగ్రవాదంపై పోరు తరహాలో చేపట్టారన్నారు. లక్షిత దాడులపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సాయుధ దళాలను ప్రశ్నిస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా దేశ భద్రత కోసం సాయుధ దళాలు పోరాడాయన్నారు. యుపిఎ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ 12 లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు అనినీతి రహిత పాలన మంత్రం జపిస్తున్నారని విమర్శించారు. 500, 1000 రూపాయల నోట్లు 23 బిలియన్‌ల మేరకు చలామణిలో ఉన్నాయన్నారు. ప్రధా ని తీసుకున్న నిర్ణయం వల్ల అవి వాటి విలువను కోల్పోయాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి, బి ఎస్పీ ఎన్నికల్లో భారీగా నల్లధనాన్ని వినియోగించేందుకు ఏర్పా ట్లు చేసుకున్నాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో కూడా ఇదే పరిస్థితి అని తెలిపారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు కొంత కాలం ఇబ్బందులు పడతారని, దానిని వేధింపులుగా భావించరాదన్నారు.