ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ అమరావతికి బ్రిటన్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: నూతన రాజధాని నిర్మాణం అరుదుగా వచ్చే అవకాశమని, అమరావతిని స్మార్ట్ సిటీగా రూపొందించడంలో బ్రిటన్, భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగం కానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానిక తాజ్ గేట్‌వేలో బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ నిర్మాణ సామర్థ్యం, అనుభవం, అమరావతికి సహకారంపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశ నిర్మాణ ప్రయత్నాలు మొదలవుతున్న ఈ తరుణంలో బ్రిటన్ సహాయ సహకారాలు త్వరితంగా అందాలని ఆయన కోరారు. బ్రిటన్, సింగపూర్ దేశాలతోసహా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పద్ధతులు ఏ దేశంలో ఉన్నా, వాటిని నిర్మాణంలో వినియోగించుకుంటామన్నారు. ఇండో-యుకె అవగాహన పత్రంలో పేర్కొన్న విధంగా అమరావతిని, బ్రిటన్ దేశం సహకారం అందించే 8 స్మార్ట్ నగరాలకు కేంద్ర బిందువుగా నిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వంతోపాటు, అక్కడ పెట్టుబడిదారుల సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుతున్నామన్నారు. 2000 ఏళ్లకు పూర్వమే అమరావతి వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి పేరిట లండన్ మ్యూజియంలో ఒక గ్యాలరీ ఉందని, ఇక్కడ చరిత్ర, సంస్కృతి మూలాలు ఆ విధంగా ‘లండన్’ నగరంలో విస్తరించాయన్నారు.
బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ మాట్లాడుతూ అమరావతి సహకారానికి మసాలా బాండ్ల రూపంలో నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ‘యుకె ఎక్స్‌పోర్టు ఫైనాన్స్’ పద్ధతిలో సైతం పెట్టుబడులకు అనువైన పరిస్థితి నెలకొల్పవచ్చన్నారు. అమరావతి రాజధానితో సహా దేశంలో 8 స్మార్ట్ సిటీలను రూపొందించేందుకు 11 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం వెచ్చించనుందన్నారు.
బ్రిటన్ ప్రతినిధి బృందం నాయకులు, బ్రిటన్ పార్లమెంటేరియన్ వీరేందర్ శర్మ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ధృఢతరం చేయడమే తమ లక్ష్యమన్నారు. సమావేశంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు కుమారి నస్రత్ ఘని, లార్డు రాణా, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... బ్రిటన్ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు