ఆంధ్రప్రదేశ్‌

కరవును తరిమేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, నవంబర్ 11: నిత్యం కరవుకాటకాలతో విలవిల్లాడుతున్న అనంతపురం జిల్లా నుండి కరవును తరిమేద్దామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బిటెక్ విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో నెలకున్న కరవును పారదోలడానికి గత ముఖ్యమంత్రులు అమలు చేసిన పథకాలు, చర్యలను తానేమీ తప్పుబట్టడం లేదన్నారు. వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరిపై కరవు ప్రభావం కనిపిస్తోందన్నారు. మనలో ఐక్యత, ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని ప్రభుత్వాలు చంపేశాయని ఆవేదవ వ్యక్తం చేశారు. కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాను ఆదుకోవడానికి ఎక్కడి నుండో వచ్చి చెనే్నకొత్తపల్లి మండలంలో టింబక్ట్ సంస్థను ప్రారంభించి అక్కడ 20వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చి ప్రజలకు అండగా నిలిచిన సంస్థ ప్రతినిధులు బబ్లూ, గంగూలీ తనకు ఆదర్శమన్నారు.
విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టి భవిష్యత్ ప్రయోజనాలను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. ‘నాకు ఆశ ఎక్కువ.. నేను అందరిలాగా ఒక గ్రామాన్నో, ఒక ప్రాంతాన్నో దత్తత తీసుకోను..ఏకంగా అనంతపురం జిల్లా మొత్తానే్న దత్తత తీసుకుంటాను’ అని చెప్పారు. జిల్లా నుంచి కరవును పారదోలేందుకు మూడు రోజుల పాటు త్వరలో పాదయాత్ర నిర్వహిస్తానన్నారు. వెనుక బడిన అనంతపురం జిల్లాకు ప్రభుత్వం రూ.6,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, అయితే అది పేపర్లలో మాత్రమే కనిపిస్తోందన్నారు. ఆ నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదన్నారు.
‘నా చిన్ననాడు జరిగిన అనేక సంఘటనలు నాకు ఈ సమాజంపై ఈర్ష్యాద్వేషాలను పెంచాయి. నేను ఆరవ తరగతిలో ఉండగా మా అక్కను ఒక రౌడీ లాక్కెళ్తుంటే మా నాన్న పోలీసై ఉండి ఏమీ చేయలేక పోయారు. అప్పుడే సమాజంపట్ల తీవ్రమైన కసి పెరిగింది. ఆ రౌడీని చంపేయాలన్న కసి నాలో కలిగింది’ అని పవన్ కల్యాణ్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. తాను చదివిన చదువు, పెరిగిన పరిస్థితులు తనలో దేశభక్తిని పెంపొందించాయన్నారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లు బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారా రారా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితులు మనకు అవసరం లేదని అన్నారు. ఆడపిల్లలను రక్షించేందుకు పకడ్బందీ చట్టాన్ని అమలు చేయడానికి 60 ఏళ్ల సమయం పట్టిందా అని ఆయన ప్రభుత్వాలను నిలదీశారు. నిర్భయ లాంటి సంఘటనలు ఢిల్లీలో జరిగితేనే మీ దృష్టికి వస్తాయా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం చేతులు కట్టుకుని కూర్చోవడం సరైన విధం కాదన్నారు. దోపిడీ, దౌర్జన్యం, పేదరికంపై పోరాడాల్సిన అవసరం మన ముందున్న కర్తవ్యమన్నారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా దండించే సమాజాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. చివరికి తాను తప్పుచేసినా కాలర్ పట్టుకుని నిలదీయండని విద్యార్థులకు సూచించారు.
పోటీ ఎక్కడో
నిర్ణయించుకోలేదు
వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీచేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, అందుకు ఇంకా సమయం ఉందని పవన్‌కల్యాణ్ అన్నారు. అనంతపురంలో శుక్రవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటనలు, సభలు పూర్తయ్యాక పోటీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
chitram...
అనంతపురం జిల్లా గుత్తిలో శుక్రవారం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్‌కళ్యాణ్