ఆంధ్రప్రదేశ్‌

నెలాఖరులో పిఎస్‌ఎల్వీ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 12: మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) సన్నద్దవుతోంది. ఈనెలాఖరులో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి పిఎస్‌ఎల్వీ-సి 36 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపే రిసోర్స్ -2 ఎ ఉపగ్రహం శనివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి అత్యంత భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన షార్‌కు చేరింది. వాతావరణ అధ్యయనానికి సంబంధించిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించింది. దీంతోపాటు విదేశాలకు సంబంధించిన మరో రెండు చిన్న ఉపగ్రహాలకు కూడా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈరాకెట్ ప్రయోగానికి సంబంధించిన ఎం ఆర్ ఆర్ సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన సోమవారం షార్‌లో జరగనుంది. ఈసమావేశంలో చర్చించిన అనంతరం ఇస్రో అధికారికంగా ప్రయోగ వివరాలు ప్రకటించనుంది. ఇప్పటికే రెండు దశల అనుసంధాన పనులు పూర్తిచేసుకున్న రాకెట్ మూడో దశ అనుసంధాన పనులు సోమవారం నుంచి శాస్తవ్రేత్తలు ప్రారంభించనున్నారు. మూడోదశ అనంతరం చివరి దశలో ఉపగ్రహాన్ని అమర్చిన అనంతరం ప్రయోగానికి రాకెట్‌ను సిద్ధం చేయనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈనెల 28న రాకెట్ ప్రయోగం జరగనున్నట్లు సమాచారం.
chitram...
భద్రత నడుమ షార్‌కు వస్తున్న రిసోర్స్ శాట్ ఉపగ్రహం