రాష్ట్రీయం

నల్లధనాన్ని వెలికితీసి.. అవినీతిని నిర్మూలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే పెద్ద నోట్లు రద్దు ప్రజల్లో భయాందోళన అక్కర్లేదు
అంతా సహకరిస్తున్నారు సరిపడా నోట్లు అందుబాటులో ఉన్నాయి
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 12: నల్లధనాన్ని వెలికితీసి అవినీతిని నిర్మూలించడంతో పాటు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకే ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిందని, దీనిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్‌లో శనివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్లను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న కార్యాచరణను వివరించారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందుగా చెప్పలేదని చాలా మంది అంటున్నారని, అదే జరిగితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేది కాదని అన్నారు. ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, కేంద్ర నిర్ణయానికి ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ లేదని ప్రస్తుతం అందరికీ అవసరమైనన్ని నోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రహస్యాన్ని గోప్యంగా ఉంచకుండా కొత్త నోట్లను ముందే పంపిస్తే అందరికీ అనుమానాలు వస్తాయని, ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు తప్పవన్న విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పాత నోట్లు స్వీకరించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగిందని, 4 వేల క్యాష్ క్లస్టర్లు ఉన్నాయని వాటన్నింటినీ నింపడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. టోల్‌గేట్లు, ఇతర సమస్యలకు కేంద్రం పరిష్కారం చూపించిందని, గడువు పొడిగించిందని అన్నారు. దేశంలో ఎక్కడా ఉప్పు సమస్య లేదని, పుకార్లు నమ్మవద్దని, కంగారు పడవద్దని ఆయన ప్రజలకు సూచించారు. దేశ వ్యాప్తంగా 23 కోట్ల మందికి పైగా ప్రజలకు ‘జన్‌ధన్’ బ్యాంకు ఖాతాలున్నాయని, వారందరికీ చెక్కు బుక్‌లు, డెబిట్ కార్డులున్నాయని, తాజా నిర్ణయంతో దేశంలో అక్రమ సంపాదకుల జాతకాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఎస్‌బిఐలో రూ.47,868 కోట్ల డిపాజిట్లు జరిగాయని, అయినా కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ న్యాయస్థానం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, నోట్ల మార్పిడి వ్యవహారాన్ని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, ‘జయహో నరేంద్ర మోదీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహమని చెప్పారు. చిన్న చిన్న సమస్యలున్నా నోట్ల మార్పిడి కార్యక్రమం సజావుగా సాగుతోందని పేర్కొన్నారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, సరిపడా నోట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.