రాష్ట్రీయం

హోదా రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయమై ఎలాంటి చట్టబద్ధత కల్పించ లేదన్నారు. అందువల్ల హోదా అంటూ రాబోదని, దానికి మించిన రీతిలో ప్యాకేజీలతో ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. ఆదివారం నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చిరమనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని కోరారు. పారిశ్రామిక అభ్యున్నతికి సహకరించడం ద్వారా నిరుద్యోగ సమస్య విస్తృతంగా రూపుమాసిపోయేలా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రధాని మోదీని ఒప్పించేలా కృషి చేయాలంటూ సభాముఖంగా వెంకయ్యనాయుడిని కోరారు. దీనికి వెంకయ్య తన ప్రసంగంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రధానిగా మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిమండలి 2014 మే 26న కొలువుదీరిందని గుర్తు చేశారు. ఆ మర్నాడు నిర్వహించిన తొలి కేబినెట్ భేటీ అజెండాలోనే ఆంధ్రప్రదేశ్‌కు జీవన రేఖగా భావిస్తూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణాలోని ఏడు మండలాలపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు నిశ్చయించినట్లు తెలిపారు. అలా కేంద్రంలో మోదీ గద్దెనెక్కిన మర్నాడే ఆంధ్రప్రదేశ్‌లో ఏడు తెలంగాణా మండలాలను కలిపే నిర్ణయంతో రాష్ట్భ్రావృద్ధికి కట్టుబడినట్లు కేంద్రం తన నిబద్ధతను రుజువు చేసుకుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐఐటి, ట్రిపుల్ ఐటి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఇఎస్‌ఆర్, నెల్లూరు జిల్లాలో వాకాడు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనల్ టెక్నాలజీ, కొండాపురం వద్ద కామధేను ప్రాజెక్ట్‌లు నెలకొల్పామన్నారు. నెల్లూరు జిల్లాలో 50 ఎకరాల స్థలం సమకూరిస్తే ఎన్‌సిఇఆర్‌టి ఏర్పాటుకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రంలో 54వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

చిత్రం.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు