రాష్ట్రీయం

మాట తప్పం... చెప్పింది చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 13: ఇచ్చిన మాట తప్పకుండా చెప్పినవన్నీ చేయడమే తమకు తెలుసని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా శ్రేయస్సే తమ ఎజెండా అంటూ భారతదేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో 120 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. వౌలిక సదుపాయల కల్పనకు మేం చేసిన కృషిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 38 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, 35వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్భ్రావృద్ధి చూసి ఓర్వలేక కుసంస్కారంతో విమర్శలే ధ్యేయంగా పార్టీలు పనిచేస్తున్నాయన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడటమే కెసిఆర్ ప్రభుత్వ విధానమని, అలా నిలబడలేక, తమ ఆటలు సాగక ప్రతిపక్ష పార్టీల నేతలు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గడిచిన రెండున్నరేళ్ళలోనే ఏమేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో బేరీజు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 22మంది దళిత మహిళలకు మూడెకరాల భూమి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, మదన్‌లాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి కెటిఆర్