రాష్ట్రీయం

పన్ను పండింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: పెద్దనోట్ల చలామణిపై కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని స్థానిక సంస్థలకు కాసులు కురిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు స్థానిక సంస్థల కార్యాలయాలకు పన్నుల రూపంలో కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను పన్ను రూపంలో చెల్లిస్తే ఆమోదిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు ప్రజలనుండి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ప్రజల నుండి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆస్తిపన్ను రూపంలో వసూలు అయింది. సోమవారం రాత్రి వరకు మరో 20-30 కోట్ల రూపాయల వరకు వసూలు అయ్యే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. స్థానిక సంస్థలకు వసూలవుతున్న పన్ను డబ్బు స్థానిక బ్యాంకుల ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సమానంగా కొత్తనోట్లను ఆర్‌బిఐ ద్వారా స్థానిక సంస్థలకు లభిస్తాయి. సోమవారం వరకు ఉన్న గడువు మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
మున్సిపల్, ఐటి మంత్రి కె. తారకరామారావు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులతోనూ, జిల్లాస్థాయి అధికారులతోనూ గత మూడు రోజుల నుండి ‘టచ్’లో ఉన్నారు. ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ మూడు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జిల్లా పంచాయితీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్‌లో చర్చిస్తూ, ఆస్తిపన్ను వసూళ్లకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకోవాంటూ సూచించారు. దాంతో అన్ని స్థానిక సంస్థల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి షిఫ్టుల్లో ఉద్యోగులను ఏర్పాటు ఏర్పాటు చేసుకుని ఆస్తిపన్ను వసూళ్లు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) తో సహా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీలు గత మూడు రోజుల నుండి ఆస్తిపన్ను వసూళ్లను యుద్ధప్రాతిపదికన (స్పెషల్ డ్రైవ్) చేస్తున్నాయి. కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలోనే గత మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల వరకు వసూలు అయ్యాయని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం వరకు అవకాశం ఉండటంతో మరో 10-15 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని వివరించారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ప్రీతిపాత్రమైన సిద్ధిపేట జిల్లాలో గత మూడురోజుల నుండి ఆస్తిపన్ను వసూలు జరుగుతోంది. ప్రజల నుండి దాదాపు 60 లక్షల రూపాయలు గ్రామపంచాయితీలు వసూలు చేశాయని జిల్లా పంచాయితీ అధికారి సురేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, వాస్తవంగా జిల్లాలోని పంచాయితీలకు ఏటా 11.27 కోట్ల రూపాయలు రావలసి ఉండగా, ఈ నెల 10 వరకు 2.45 కోట్లు వసూలైందని, గత మూడు రోజుల్లోనే 60 లక్షలు వసూలైందని వివరించారు. సోమవారం వరకు వసూళ్లకు అవకాశం ఉండటంతో మరింత ఎక్కువ వసూళ్లు జరిగే అవకాశం ఉందన్నారు.
సిద్ధిపేట మున్సిపాలిటీ కమిషనర్ సత్యబాబు ఆదివారం సాయంత్రం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, మొన్న 44 లక్షలు, నిన్న 12 లక్షలు, ఈరోజు ఏడులక్షల రూపాయలు వసూళ్లు అయ్యాయని తెలిపారు. ఏటా మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5.5 కోట్ల రూపాయలు రావలసి ఉంటుందని, ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తోందన్నారు.