రాష్ట్రీయం

చేనేత రుణమాఫీకి మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు జీవో 01ను శుక్రవారం విడుదల చేసింది. చేనేత, జౌళిశాఖ కమిషనర్ చేనేత కార్మికుల రుణమాఫీ నిమిత్తం మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికుల రుణమాఫీ నిమిత్తం జిల్లా, రాష్టస్థ్రాయి కమిటీలను నియమించారు. జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. ఇందులో జాయింట్ కలెక్టర్ కో చైర్మన్‌గా, సభ్యులుగా డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ , లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డిప్యూటీ లేదా అసిస్టెంట్ మేనేజర్‌ను నియమించారు. కన్వీనర్‌గా చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. బ్యాంకుల ద్వారా రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల జాబితాను తీసుకుని జిల్లాస్థాయి కమిటీకి నివేదిస్తారు. జాబితాను జిల్లా కమిటీ స్క్రూటినీ చేస్తుంది. కమిటీ సిఫార్సు మేరకు చేనేత శాఖ కమిషనర్ నిధులను బ్యాంకులకు విడుదల చేస్తారు. బ్యాంకుల్లో చేనేత కార్మికుల రుణం ఉన్న అకౌంట్లకు నిధులు నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటారు. రాష్టస్థ్రాయి కమిటీకి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిని చైర్మన్‌గా నియమించారు. కమిటీకి కన్వీనర్‌గా చేనేత, జౌళి శాఖ కమిషనర్, మెంబర్ కన్వీనర్‌గా హ్యాండ్‌లూమ్స్ శాఖ జాయింట్ డైరెక్టర్, సభ్యులుగా నాబార్డు సిఎండి, స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ మెంబర్ సెక్రటరీ, ఆప్కాబ్ ఎండిని నియమించారు. బ్యాంకులు ఇప్పటికే రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందే అర్హులైన కార్మికుల దరఖాస్త్ఫురం, ఆధార్ కార్డు, వీవర్స్ క్రెడిట్ కార్డు నంబర్‌ను సేకరించాయి. ఈ వివరాలను బ్యాంకులు కంప్యూటీకరణ చేశాయి. రుణమాఫీకి అర్హత సంపాదించి ఒకవేళ ఏ కారణం వల్లనైనా రుణమాఫీ జాబితాలో పేరు లేనిపక్షంలో చేనేత కార్మికులు బ్యాంకుకు లేదా ఫిర్యాదులను పరిష్కారం చేసే అధికారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలి. బ్యాంకులు తమ వద్దనున్న అర్హులైన జాబితాలో ప్రయోజనం పొందే వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
జిల్లా కమిటీ ఖరారు చేసిన లబ్ధిదారుల జాబితాను బ్యాంకులు, హ్యాండ్ లూమ్స్ శాఖ అధికారులు వారంలోగా క్లియర్ చేయాలి. జిల్లా కమటీ స్క్రూటినీ చేసిన ఏడురోజుల్లోగా రుణ మొత్తాన్ని సంబంధించిన చేనేత కార్మికుల అకౌంట్లలో జమ చేయాలి. బ్యాంకు అధికారులకు రుణమాఫీకి సంబంధించిన సంశయాలు ఉంటే వెంటనే జిల్లాస్థాయి కమిటీకి తెలియచేయాలి. దీనికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ కమిటీలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికుల రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేసేందుకు గతంలో కోటయ్య కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంది. 2014 మార్చి 31 వరకు బ్యాంకుల్లోవున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు.