రాష్ట్రీయం

ముద్రగడ యాత్రపై స్టేకు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: కాపునేత ముద్రగడ పద్మనాభం 16వ తేదీ బుధవారం నుంచి తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను నిలుపుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన నిరసన తెలియచేసే హక్కు ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం రాజమండ్రికి చెందిన న్యాయవాది మేడా శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ముద్రగడ పాదయాత్ర వల్ల శాంతి భద్రతలు ఉత్పన్నమవుతాయని నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ శాంతి భద్రతలు రాష్ట్రప్రభుత్వ పరిధిలోనివని పేర్కొంది. ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాదన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ, ఈ ఏడాది తునిలో ముద్రగడ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిందన్నారు. ఈ దృష్ట్యా తాజా సత్యాగ్రహ పాదయాత్రకు స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు ఈ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని, హింస తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు పేర్కొంది.