రాష్ట్రీయం

ఏసిబికి తగ్గిన ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అవినీతి నిరోధక శాఖకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఫోన్‌కు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి సగటున రోజూ 20 వరకు అవినీతిపై ఫిర్యాదులు వచ్చేవి. కాని ప్రధాని నరేంద్రమోదీ గత మంగళవారం పెద్దనోట్ల రద్దు ప్రకటనతో అవినీతిపై ఫిర్యాదులు తగ్గినట్లు ఏసిబి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రోజుకు ఐదుకు ఈ ఫిర్యాదులు పరిమితమయ్యాయి. సాధారణంగా ఏసిబి కేసుల్లో ఐదు వందలు, వెయ్యి నోట్లు పట్టుబడుతుంటాయి. పైగా లంచం అడిగే వారికి కూడా ఇచ్చేవారు పెద్ద నోట్ల రూపంలోనే లంచం ఇస్తుంటారు. కాగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నగదుకు బదులు ఖరీదైన బహుమతులు అడుగుతున్నట్లు, మరి కొందరు వంద రూపాయల డినామినేషన్ ప్రకారం లంచంగా సొమ్ము ఇవ్వాలని కోరుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఏసిబి వర్గాలు తెలిపాయి. మరోవైపు పెద్దనోట్ల రద్దు ప్రభావం సైబర్ నేరాలపైనా పడింది. ఆర్థిక లావాదేవీల్లో రుణాలు, మేట్రిమోనియల్ ఫ్రాడ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవి. కొంత మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల మాటలు విని ఆన్‌లైన్‌లో సొమ్మును డిపాజిట్ చేస్తే నేరగాళ్లు మరో చోట డ్రా చేసే వారు. పెద్ద నోట్ల రద్దుతో సైబర్ నేరగాళ్లు ఇది సమయం కాదనుకున్నారేమో కార్యకలాపాలను నిలిపివేశారు. రోజుకు పది వరకు రకరకాల ఆర్థిక సైబర్ నేరాలపై ఫిర్యాదులు వచ్చేవి. ప్రస్తుతం ఈ సంఖ్య తగ్గిందని పోలీసులు తెలిపారు.