రాష్ట్రీయం

కరెన్సీ ‘థ్రెడ్’ ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: మన దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగించే సిరా (ఇంక్), సిల్వర్ థ్రెడ్‌ను సరఫరా చేస్తున్న సంస్థే పాకిస్తాన్‌కూ సరఫరా చేస్తున్నదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని ఆయన మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఉన్నపళంగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తేవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని, గడువుఇవ్వాల్సి ఉందని అన్నారు. అలా చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బులు ఖాతాలో జమ చేస్తుంటే పట్టుకోవాలని అన్నారు. గతంలో ఫిలిప్పీన్స్, యూరప్ దేశాల్లో నోట్ల మార్పిడి చేసినా, ప్రజలకు సరిపోయేంత గడువు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును ప్రజలు వినియోగించుకునే పరిస్థితి లేదని, అందుకు సరిపడా చిల్లర వ్యాపారుల వద్ద లేదని అసద్ అన్నారు.