రాష్ట్రీయం

రూ.5 లక్షల పెద్దనోట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 15: మావోల ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత వేగంగా దూసుకు వెళ్తోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దండకారణ్యంలోని బస్తర్ రీజియన్‌లో మావోయిస్టులకు చెందిన రూ.7వేల కోట్లు పెద్ద నోట్లు ఉన్నాయని గుర్తించిన నిఘా వర్గాలు వాటి మార్పిడిపై దృష్టి సారించాయి. సోమవారం దండకారణ్యంలోని కాంకేర్ జిల్లా నుంచి మహారాష్టక్రు బస్సులో తరలిస్తున్న రూ.5 లక్షలకు పైగా పెద్ద నోట్లను బిఎస్‌ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. మావోయిస్టులకు విరాళాలు, చందాల రూపంలో వచ్చిన రూ.1000, రూ.500ల నోట్లను ఒక వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతంలో మార్చేందుకు వెళ్తూ బిఎస్‌ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తున్నారు. భారీగా నగదు వస్తుందని సమాచారం రావడంతో తనిఖీలు చేయగా ఇవి దొరికాయని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. వాటికి సరైన లెక్కలు చూపడం లేదని, ఖచ్చితంగా అవి మావోయిస్టులకు సంబంధించినవేనని వారు పేర్కొంటున్నారు.

చిత్రం.. బిఎస్‌ఎఫ్ జవాన్ల తనిఖీలో పట్టుబడ్డ వ్యక్తి