రాష్ట్రీయం

అధునాతన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: ఆర్టీసీ ప్రయాణికులకు దశలవారీగా విస్తృత సేవలు అందిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లతో అనుసంధానం చేసే వీడియో లింకేజీ ప్రోగ్రాంను తొలిసారిగా రాష్ట్రంలో తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం తొలిదశగా 9 బస్టాండ్‌లలో ఈ ప్రోగ్రాంను అనుసంధానం చేశామన్నారు. ప్రతి బస్టాండ్‌లోను డైనమిక్ విధానంలో ప్రజలకు విశేష సేవలు అందించగలమన్నారు. అమరావతి పేరుతో ఒక్కో బస్సు 1 కోటి 21 లక్షలు ఖర్చుతో కొనుగోలు చేసిన స్కానియా ఓల్వో బస్సులను శుక్రవారం రాత్రి సిఎం స్వయంగా ప్రారంభించారు. బస్సులోపలి భాగాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి మొదటి సీటులో కూర్చుని కొద్దిదూరం ప్రయాణం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో బస్సు అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. విజయవాడకు 15 బస్సులను కేటాయించగా నేడు తొమ్మిది బస్సులను సిఎం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు, కలెక్టర్ బాబు ఎ, మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా రీజనల్ మేనేజర్ పివి రామారావు, పలువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలో అధునాతన బస్సులు ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు