ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్లో హోంశాఖ ఫిర్యాదుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: హోంశాఖ పరిధిలో ఇకపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు పంపాలన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎవరైనా తాముచేసే ఫిర్యాదుతో పాటు ఆధార్‌కార్డు నెంబరును కూడా పొందుపరచాల్సి ఉంటుందన్నారు. హోంశాఖకు అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు బదలాయిస్తామని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతామని వివరించారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ లక్ష్మి అరెస్టు విషయంలో పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబించారనే ఆరోపణలపై చినరాజప్ప స్పందిస్తూ దీనిపై విచారణ జరుగుతోందని, వాస్తవమని తేలితే బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కడప జిల్లా పాదయాత్రకు బపయల్దేరిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను అరెస్టుచేసిన విషయాన్ని విలేఖర్లు ప్రస్తావించగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు. టిడిపి జనచైతన్య యాత్రలతో తన పాదయాత్రను ముడిపెట్టడం ముద్రగడకు తగదన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు ముందస్తు అనుమతి తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ అనుమతి అవసరంలేదని ముద్రగడ చేస్తున్న వాదన సరైంది కాదన్నారు. ఎప్పుడు సత్యాగ్రహ యాత్ర చేపట్టినా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపట్టే పాదయాత్రలన్నింటికీ ప్రభుత్వ అనుమతులు ఉండాలన్నారు.