రాష్ట్రీయం

ఇక ఆరోగ్యమస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 1: వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు రాష్టస్థ్రాయి పథకాలకు సిఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరోగ్య వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే పథకాలను నూతన ఏడాది రోజున ప్రారంభించారు. ప్రధానమైన ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వాసుపత్రుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం వైద్యం ఖర్చుల్లో 40 శాతానికి పైగా పరీక్షలకే సరిపోతోందని, ఈ భారం నుంచి పేదలను తప్పించడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రుల్లో 60 పరీక్షలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 40 పరీక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19 పరీక్షలు ఉచితంగా అందించనున్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో శుక్రవారం నుంచే ప్రారంభించినట్టు ప్రకటించారు. అదేవిధంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయటం ద్వారా సిఎం ప్రారంభించారు. దీనిలోభాగంగా ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లిబిడ్డను జాగ్రత్తగా వారి ఇళ్లవద్ద దింపడానికి వాహనాన్ని వినియోగిస్తారు. రాష్టవ్య్రాప్తంగా 270 వాహనాలను ఈ పథకం కోసం సిద్ధంచేశారు. అయా ఆసుపత్రుల నుంచి 102 కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి, తమ చిరునామా, ప్రాంతం చెపితే వాహనం అక్కడకు చేరుకుని తల్డీబిడ్డను వారి ఇళ్లలో దింపుతారు.
అలాగే టెలి రేడియాలజీ పథకాన్ని సైతం చంద్రబాబు ప్రారంభించారు. దీనిలోభాగంగా ప్రమాదాలకు, ఇతర అనారోగ్యాలకు గురైన సమయాల్లో రోగుల పరీక్షల వివరాలను నిపుణులకు పంపి, వారినుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఇక్కడ వైద్యులు సత్వరం సేవలు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. నిపుణులు ఎక్కడున్నా వారికి రోగుల పరీక్షల వివరాలను పంపి, వారినుంచి వైద్య సలహాలను పొందవచ్చునని చెప్పారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్నిచోట్లా తల్డీబిడ్డ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పది కోట్ల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు.
నూతన సంవత్సర వేడుకల్లో..
ఈ సందర్భంగానే నూతన సంవత్సర వేడుకలను కూడా నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలోనే సిఎం చంద్రబాబు న్యూ ఇయర్ కేక్ కట్‌చేసి ప్రజాప్రతినిధులు అందరికీ అందజేశారు. అనంతరం ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి, న్యూఇయర్ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాజధాని అమరావతికి దీటుగా పక్కనేవున్న ఏలూరు నగరాన్నీ తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేస్తునట్టు ప్రకటించారు.

చిత్రం... విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను సిఎం చంద్రబాబు దంపతులు శుక్రవారం
దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సతీమణికి ప్రసాదం పెడుతున్న చంద్రబాబు