ఆంధ్రప్రదేశ్‌

అప్పన్నకు ‘పెద్ద’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 17: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం హుండీల్లో ఎన్నడూ లేనివిధంగా పెద్దనోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. హుండీల్లో ఆరుదుగా కనిపించే పెద్ద నోట్ల కట్టలు ఈసారి ఆరు దర్శనమిచ్చాయి. సాధరణంగా 20 నుండి 30 రోజుల మధ్య దేవస్థానం హుండీలను తెరవడం సంప్రదాయం. ఎప్పుడో తప్పితే పెద్దనోట్ల కట్టలు కానుకల రూపంలో రావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వెయ్యి, అయిదు వందలు కట్టలు ఒకటి రావడం గగనం. గురువారం తెరిచిన హుండీల్లో మాత్రం పెద్దనోట్ల కట్టలు ఆరు కనిపించాయి. వెయ్యి రూపాయల కట్టలు రెండు, అయిదు వందల కట్టలు నాలుగు దర్శనమిచ్చాయి. కొండ దిగువ తొలిపావంచా హుండీలో అయిదు వందల రూపాయల కట్ట ఒకటి వచ్చింది. 10 రోజులకు దేవస్థానం హుండీల ద్వారా వచ్చిన ఆదాయం 41 లక్ష 61 వెయ్యి 227 రూపాయలు నగదు రూపంలో వచ్చింది. 40 గ్రాముల బంగారం, 2కిలోల 470 గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారుల సూచనల మేరకు హుండీలను తెరిచిన దేవస్థానం ఆదాయాన్ని లెక్కించి ఎస్‌బిఐకు అప్పగించింది. వెయ్యి నోట్లు 416, అయిదు వందల నోట్లు 1082తో పాటు కొత్తగా చలామణీలోకి వచ్చిన 2000 రూపాయల నోట్లు 19 కానుకలుగా వచ్చాయి. పెద్ద నోట్ల రూపంలో సుమారు 14 లక్షల 90 వేల రూపాయలు రాగా చిల్లర నోట్లు , నాణేల రూపంలో సుమారు 36.5 లక్షలు భక్తులు సమర్పించారు.