రాష్ట్రీయం

పాత్రికేయులకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద విశే్లషాణాత్మక కథనాలు అందించిన పాత్రికేయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద ఉత్తమ వార్తా కథన పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, నాలెడ్జ్ సిటీగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ ఉన్నత లక్ష్యంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన పాత్రికేయులను కూడా భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ నిర్ణయించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన వారితో కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి పూర్తి పారదర్శకంగా ప్రకటిస్తామని తెలిపారు. ప్రింట్ మీడియాలో ఇంగ్లీషు, తెలుగుతోపాటు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఈ అవార్డులు అందజేస్తామని అన్నారు. ఒక్కో అవార్డుకు రూ.25 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తామని తెలిపారు. ఈ వివరాలన్నీ జనవరి 1 నుంచి ఎంహెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌తో పాటు సిఎస్‌సి, ఎస్‌ఎస్‌ఏ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
బెజవాడకు ఐఏఎస్‌ల
బస్సు ప్రయాణం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ఐఏఎస్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును కలిసిన బృందంలో సీనియర్ ఐఏఎస్‌లు జెపి శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, సిసోడియా, రవిచంద్ర, లింగరాజ్ పాణి గ్రహి, అశోక్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
పెన్షనర్లకు మెడికల్ అలవెన్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు మెడికల్ అలవెన్సు రూ.300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఉత్తర్వుల వల్ల ప్రభుత్వ పెన్షనర్లతో పాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన పెన్షనర్లకు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు చెందిన నాన్ టీచింగ్ పెన్షనర్లకు అలెవెన్సు మంజూరు చేసే విధానం డిసెంబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.