రాష్ట్రీయం

తిరుమలలో తగ్గిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజున శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల సంఖ్య అంచనా వేసిన స్థాయికి చేరలేదు. జనవరి 1 శుక్రవారం ఉదయం 6 గంటల నుండి భక్తులను దర్శన నిమిత్తం ఆలయంలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రొటోకాల్ విఐపిలకు కల్పించే దర్శనాల సంఖ్యను, సమయాన్ని కూడా తగ్గించడంతో సామాన్య భక్తులను అరగంట ముందుగా 5.30 గంటలనే ఆలయంలోకి అనుమతించారు. అంతకుమునుపు వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఉదయం 10.30 గంటల సమయానికి వెలుపల ఉన్న క్యూలైన్లలో ఉన్న భక్తులందరూ వైకుంఠ కాంప్లెక్స్‌లో చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తులందరికీ మహా లఘు ద్వారా దర్శనం సౌకర్యం కల్పించారు. అర్థరాత్రి 12 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు తెరిచిన టిటిడి ప్రసార మాద్యమాల ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషలలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఆలయం ముందు ఉన్న విశాల స్థలంలో వేచివున్న భక్తులు ఒక్కసారిగా గోవింద నామస్మరణలు చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. వాస్తవానికి గత ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం, జనవరి 1 ఒకే రోజు రావడంతో సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందుగా రావడంతో ఆ పర్వదినాల్లోనే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చారు. దీంతో జనవరి 1న భక్తుల రద్దీ అధికారుల అంచనాకు తగినవిధంగా రాలేకపోయారు. అంతేకాకుండా తమిళనాడులో పాఠశాలలు పునః ప్రారంభకావడం కూడా శుక్రవారం భక్తుల రద్దీ తక్కువ కావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాగా జనవరి 1న తిరుమలకు వచ్చిన భక్తులు మాత్రం 6 గంటల వ్యవధిలోనే స్వామి వారిని దర్శించుకునే సౌకర్యం కలగడంతో ఆనందం వ్యక్తం చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టిటిడి కనువిందుగా అలంకరించింది. ఆలయ ప్రాకారాలకు, గోపురాలకు రంగు రంగుల విద్యుద్దీపాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆలయంలోని ద్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయం, వివిధ దేవతామూర్తుల ఉప ఆలయాలను సుందరంగా అలంకరించారు.

తిరుమల శ్రీవారి ఆలయాన్ని పుష్పాలు, రంగు రంగు విద్యుత్‌దీపాలతో అలంకరించిన దృశ్యం.. స్వామి దర్శనానికి క్యూలైన్‌లో వస్తున్న భక్తులు