రాష్ట్రీయం

పుస్తకాలతోనే ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: కంప్యూటర్, టివి వినియోగం ఎంత పెరిగినప్పటికీ మనసుకు ప్రశాంతత నిచ్చేందుకు పుస్తకం ఒక్కటే పెద్ద దిక్కు అని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. స్వరాజ్య మైదానంలో 27వ పుస్తక మహోత్సవాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడి, బావి, ఉద్యానవనం, నిధి, కొడుకు, చెరువు వీటన్నిటి కంటే కావ్యం ఒక్కటే శాశ్వతంగా నిలబడగలదన్న అలనాటి రచయిత శ్రీకృష్ణదేవరాయల మాటలను ఆయన ఉదహరించారు. ప్రజాస్వామ్యానికున్న నాలుగు మూలస్తంభాలను నిలబెట్టేది పుస్తకం ఒక్కటేనన్నారు. సంస్కారవంతులకు పుస్తకమనేది ఒక వ్యామోహంగా ఉండాలన్నారు.
సమాజాన్ని నిద్రపుచ్చేవి, సమాజాన్ని మేల్కొలిపేవి అని రెండు రకాల పుస్తకాలు ఉంటాయనీ, ఎలాంటి పుస్తకాలు కావాలో పాఠకులే నిర్ణయించుకోవాలన్నారు. పుస్తకం చదివి దానిలోని మంచి చెడులను నిర్ణయించే వివేకం పాఠకులకు ఉండాలన్నారు. వివిధ భాషల్లోని గొప్ప రచనలను చదవగలిగితే భారతదేశమంతా ఒకే విధమైన వ్యవస్థ స్వభావం, వ్యక్తుల స్వభావం ఒకేలా ఉన్నాయని గ్రహించవచ్చన్నారు.
పుస్తకాన్ని ప్రచురణకర్తలు, విక్రేతలు, పాఠకులు, రచయితలు, ప్రభుత్వం అనే ఐదు స్తంభాలు కలిసి రక్షించాలన్నారు. లాభనష్టాలకు అతీతంగా జిల్లా గ్రంథాలయాలను, గ్రంథాలయ వ్యవస్థను పునర్జీవింపచేయాలని రాచపాళెం కోరారు.పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ప్రారంభించిన జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం ద్వారా విలువైన పుస్తకాలు అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ 2016 సంవత్సరంలో మరెన్నో పండుగలకు ఈ పుస్తకాల పండుగ శ్రీకారం చుడుతుందన్నారు. పుస్తకం అనేది మనసుకు ఉత్తేజం కలిగించే అంశమన్నారు.
సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ వ్యాపార ధోరణి ఎంతగా పెరుగుతున్నప్పటికీ నాగరికతకు పుస్తకాల వల్ల పరిజ్ఞానం, ఆలోచనల్లో స్పష్టత వస్తుందన్నారు. మహాత్మాగాంధీ వంటి వారందరినీ మంచి పుస్తకాలు ప్రభావితం చేశాయని గుర్తుచేశారు. టివి 9 సిఇవో రవిప్రకాశ్ మాట్లాడుతూ ఇంటర్నెట్ ఆధారిత ప్రపంచంలో పుస్తకం బతికేందుకు ప్రచురణకర్తలు నడుం బిగించాలన్నారు. సభలో పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసససభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాల్స్ అన్నింటిని అతిథులు కలియతిరిగి ప్రత్యేక శ్రద్ధగా పరిశీలించారు.

chitram...
పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ స్టాల్