రాష్ట్రీయం

గాలి ఆస్తులపై ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, నవంబర్ 21: మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్యాలయం, బళ్ళారిలోని గాలి ఇంటితోపాటు హైదరాబాద్‌లోని కోఠి (గుజరాత్ గల్లి)లోగల ఓ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. హుబ్లీ ఆదాయశాఖ అధికారుల బృందం ఏకకాలంలో బళ్ళారిలోని ఓబుళాపురం మైనింగ్ కార్యాలయంలోనూ, గాలి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
ఇటీవల జరిగిన తన కూతురు బ్రాహ్మణి పెళ్ళి ఖర్చుకు సంబంధించి కొన్ని ఆధారాల రశీదులు గుర్తించినట్టు తెలిసింది. కాగా పెళ్లి ఖర్చు వివరాలు వారం రోజుల్లో వెల్లడించాలని ఈ సందర్భంగా అధికారులు నోటీసులు జారీ చేశారు. పెళ్ళికి సంబంధించిన ఖర్చుల వివరాలు సవివరంగా అందజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మైనింగ్ కార్యాలయంలో ఎలాంటి అధారాలు లభించలేదని తెలిసింది. ఇదిలావుండగా హైదరాబాద్‌లో గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన పలు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.