రాష్ట్రీయం

పువ్వే కదాని కోస్తే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్-ఖైరతాబాద్, జనవరి 1: అందంగా కన్పించిన గులాబి పూలను చూసి ముచ్చటపడి స్వామికి సమర్పించేందుకు సిద్ధపడిన ఓ అయ్యప్పభక్తుడికి అనుకోని కష్టం వచ్చిపడింది. కళ్లముందు కళకళలాడుతున్న పూలనుకోసి పూజకు ఉపయోగిద్దామనుకున్న ఆ ఉద్యోగికి భగవంతుడి అనుగ్రహం మాటేమోగాని తన పై అధాకారి అగ్రహానికి గురయ్యాడు. అనుమతిలేకుండా పూలుకోసినందుకుగాను ఓ కాంట్రాక్టు ఉద్యోగిని అవమానించి, జరిమానా విధించి, ఆపై సస్పెండ్ చేసిన ఓ అధికారి తీరుపై ఆగ్రహం పెల్లుబికింది. చివరకు అది ఆందోళనకు దారితీసింది. నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో పెంచిన పూదోటలో గులాబీ పూలు విరబూశాయి. అక్కడే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ అయ్యప్పదీక్షలో ఉన్నాడు. అయ్యప్పపూజలో వాడేందుకు కొన్ని గులాబీలను కోశాడు. అనుమతిలేకుండా పూలుకోసిన ఆ ఉద్యోగిపై అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో పువ్వుకు ఐదు వేల చొప్పున మొత్తం రూ. 25 వేలు జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తాను పూజ నిమిత్తమే పూలు కోసానని ఎంత చెప్పినా ఆయన విన్పించుకోలేదు.
అతడిని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు పిలిపించి సెల్‌ఫోన్‌ను లాక్కొని అక్కడే నిలబడమని ఆదేశించాడు. ఇంతటితో ఆగకుండా పది రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పడంతో కోపోద్రిక్తులైన కాంట్రాక్ట్ కార్మికులు సెక్యూరిటీ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. డాక్టర్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేధింపులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. నిమ్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులపట్ల యాజమాన్యం వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రులు నిమ్స్‌కు వస్తూండటంతో, ధర్నా చేస్తున్న కార్మికులవద్దకు వెళ్లి కృష్ణారెడ్డి క్షమాపణ కోరారు. అయినా కార్మికులు శాంతించ లేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న మంత్రి తలసాని ధర్నా జరుగుతున్న చోటికి వెళ్లి నూతన సంవత్సరం రోజు నిరసనలు వద్దని, కాంట్రాక్ట్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడదామని నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

నిమ్స్ ముందు ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు