రాష్ట్రీయం

సర్కారు ఆసుపత్రుల్లోనే 50 శాతం ‘ఆరోగ్యశ్రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఇకపై ఆరోగ్య శ్రీ సేవలు 50 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి సూచించారు. జిల్లా వైద్యాధికారులు, జిల్లా వైద్యశాలల సూపరింటెండెంట్‌లతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఇకపై ప్రసవాలు 50 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని చెప్పారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీల ఆధ్వర్యంలోనే ఇకపై కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామకం జరుగుతుందని చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ వైద్యం ప్రజలకు మరింత చేరువ అయిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వైద్య శాలల డాక్టర్లు, సిబ్బంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, వరంగల్ వైద్య శాలలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పరిమిత వనరులతో, స్వీయ క్రమశిక్షణతో ఆర్మూర్ వైద్యశాల సిబ్బంది ఆద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. ఒకేచోట అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పించనున్నట్టు చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవలు ప్రస్తుతం 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని, వీటిని 50 శాతానికి పెంచాలని అన్నారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో వైద్యాధికారులు, సూపరింటెండెంట్‌లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న టి.మంత్రి లక్ష్మారెడ్డి