రాష్ట్రీయం

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తీర్పు 13కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కుషాయిగూడ, నవంబర్ 21: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఎన్‌ఐఏ కోర్టు డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి, కోణార్క్ థియేటర్‌ల వద్ద సంభవించిన బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 136 మంది గాయపడిన విషయం తెలిసిందే. కాగా సోమవారం చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు హత్య, హత్యాయత్నం, కుట్ర అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల నిరోధక చట్టం, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టప్రకారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులు రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, అక్తర్ అలియాస్ మోను, వకాస్, యాసిన్ భత్కల్, ఎజాజ్ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే వీరిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచేందుకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో విచారణను చర్లపల్లి జైలుకే పరిమితం చేశారు. చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపారు. దాదాపు మూడున్నరేళ్ల పాటు సాగిన విచారణలో ఇప్పటి వరకు 157 మంది సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. 502 డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు సమర్పించారు. సోమవారం ఈ కేసుపై ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగగా తుది తీర్పునకు మరింత ప్రక్రియ మిగిలి ఉన్నందున డిసెంబర్ 13కు ఈ తుది తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. తీర్పు సోమవారం వెలువడుతుందని తెలియడంతో జైలులోని ఖైదీలతో పాటు బాధిత కుటుంబీకులు ఉత్కంఠతో చర్లపల్లికి జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కేసు తీర్పును వాయిదా వేస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా 5వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తీర్పు వాయిదా అనంతరం నిందితులను చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కె వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక సెల్‌కు తరలించారు.

చిత్రం.. బందోబస్తుతో చర్లపల్లి జైలుకు వస్తున్న ఎన్‌ఐఏ అధికారులు