రాష్ట్రీయం

అభివృద్ధిలో దూసుకుపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు రెండు ముందుండాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం సుహృద్భావంతో కలిసి మెలిసి అభివృద్ధిలో పోటి పడ్డాలన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాజభవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాలు చక్కగా పని చేస్తున్నాయని, పరిపాలన బాగుందని, ముఖ్యమంత్రులు ఇద్దరూ పరిపాలనాదక్షులని గవర్నర్ కొనియాడారు. రెండు రాష్ట్రాలలో కూడా శాంతి భద్రతలు భేష్‌గా ఉన్నాయని గవర్నర్ అభినందించారు. ఇలా ఉండగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ శర్మ, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలో ఉన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్‌తో కెసిఆర్ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌తో గంటసేపు సమావేశమయ్యారు. ఈ నెల చివరివారంలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మెట్రోరైలు ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వం రూపొందించుకున్న కార్యాచరణను ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించారు.

రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గవర్నర్ దంపతులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న విద్యార్థులు