రాష్ట్రీయం

జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపునకు ప్రత్యేక బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిలు, ఎన్‌ఐటిలలో అడ్మిషన్ల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటి) డైరెక్టర్ డాక్టర్ ఆర్ వై ఉదయ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మానవ వనరుల మంత్రిత్వశాఖలో ఐఐటిల వ్యవహారాలు చూసే డైరెక్టర్, ఎన్‌ఐటిల వ్యవహారాలు చూసే డైరెక్టర్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నామినీ, సిబిఎస్‌ఇ ప్రతినిధి, అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఐఐటిలలో, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసే సంస్థల్లోనూ, ఎన్‌ఐటిల్లోనూ యుజి కోర్సుల అడ్మిషన్లను పరిశీలిస్తుంది. ఈ కమిటీని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ పేరిట వ్యవహరిస్తారు. 2015లో తొలిసారి ఇదే తరహా కమిటీని నియమించడంతో చాలా సమస్యలు తేలికగా పరిష్కారం అయ్యాయని మానవ వనరుల మంత్రిత్వశాఖ పేర్కొంది. దాంతో అప్పటినుండి ప్రతి ఏటా ఈ కమిటీని నియమిస్తోంది. గతంలో మాదిరి ఈసారి ఐఐటి జెఇఇలో ర్యాంకు నిర్ధారణకు ప్లస్ టు మార్కుల వెయిటేజీని తొలగించారు. కాకపోతే ప్లస్‌టులో విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు లేదా తొలి 20 పర్సంటైల్‌లో ఉండాలి, ఎస్సీ ఎస్టీలు మాత్రం 65 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.