రాష్ట్రీయం

అప్పన్న సేవలో కంచిస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 22: కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి మహాస్వాములు మంగళవారం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి స్వాములకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయం బేడమండపంలో ప్రదక్షిణ చేసిన స్వాములు అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గోదాదేవి సన్నిధిలో స్వాములు హారతులు స్వీకరించారు. అనంతరం నాదస్వర వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చకులు వేద స్వస్తి పలికారు. ఈవో స్వామీజీలకు ప్రసాదాలను, శేషవస్త్రాలను, సింహాచలేశుని చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
సింహాచలానికి విద్యార్థులను
పంపుతాం: విజయేంద్ర సరస్వతి
శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి కొలువుతీరివున్న సింహాచల క్షేత్రానికి తమ విద్యార్థులను పంపుతామని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. మంగళవారం సింహగిరి నరహరిని దర్శించుకున్న విజయేంద్ర సరస్వతి మహాస్వామికి దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ దేవాలయంలో కొత్తగా నిర్మించిన వంటశాలను చూపించారు. వంటస్వాములకు శిక్షణ ఏర్పాటు చేస్తే భాగుంటుందన్న అభిప్రాయాన్ని విజయేంద్ర సరస్వతి వ్యక్తం చేసారు. దేవాలయంపై ఉన్న శిల్ప సంపదను పరిశీలనగా తిలకించిన విజయేంద్ర సరస్వతి తనవెంట తీసుకువచ్చిన ఫొటోగ్రాఫర్‌తో వరాహ, నృసింహ, కూర్మావతారాల శిల్పాలను ప్రత్యేకంగా తీయించారు. బేడమండపంలో ఉన్న కొన్ని అవతారాల విగ్రహాల వద్ద స్వామీజీ ఫొటోలు దిగారు. పీఠం ఆధ్వర్యంలోనడుస్తున్న పాంచరాత్ర ఆగమ పాఠశాల విద్యార్థులను సింహాచలం పంపుతామని ఇక్కడ శిల్పాల పై అవగహన కలుగుతుందని స్వామీజీ అధికారులతో అన్నారు. అనంతరం క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.

చిత్రం.. కంచి కామకోటి పీఠాధిపతులకు స్వాగతం పలుకుతున్న
సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్