రాష్ట్రీయం

నూతన సంవత్సర వేడుకలపై ‘కాల్‌మనీ’ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, జనవరి 1: మార్కెట్లో నగదు రొటేషన్ లేకపోవటంతో దీని ప్రభావం నూతన సంవత్సర వేడుకలపై పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడలో కాల్‌మనీ దుర్మార్గాలు బయటపడిన తరువాత రాష్టవ్ట్రాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించిన నేపధ్యంలో వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా పోయాయి. చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎప్పటికప్పుడు తమకు అవసరమైనంత సొమ్మును వడ్డీ వ్యాపారుల నుండి తీసుకోవటం, తరువాత వడ్డీతో కలిపి వాయిదాల పద్ధతిలో చెల్లించటం ఏళ్ల తరబడి అలవాటయింది. నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర ముఖ్యమైన పండుగల సమయంలో వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తీసుకుని ఖర్చుపెట్టి, తరువాత నెమ్మదిగా తీర్చటానికి అలవాటుపడ్డ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇపుడు కాల్‌మనీ కేసులు పుణ్యమా అని అప్పుపుట్టకుండా పోయింది. నూతన సంవత్సర వేడుకలపై దీని ప్రభావం గట్టిగానే పడింది. సంపన్నులు, సొంతంగా ఖర్చుపెట్టి నూతన సంవత్సర సరదాలు తీర్చుకోగలిగే వారిపై కాల్‌మనీ కేసులు ప్రభావం లేకపోయినప్పటికీ, వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి ఎప్పటికప్పుడు సంబరాలు చేస్తూ, తరువాత అప్పులు తీర్చుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో మాత్రం డబ్బులు లేకుండా పోయాయి. దాంతో గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన మద్యం అమ్మకాలతో పోలిస్తే, గురువారం అమ్మకాలు 25శాతం తగ్గాయి. గతం కన్నా ధర పెరగటంతో పాటు, మందు బాబులు సంఖ్య కూడా పెరిగిన తరువాత కూడా గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 25శాతం తగ్గడానికి జనం చేతుల్లో డబ్బులు లేకపోవటమే కారణమని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, మద్యానికి బానిసలవకుండా చేయగలిగితే ఈ కుటుంబాలు ఆర్ధికంగా ఎంత పుంజుకుంటాయో అర్ధంచేసుకోవచ్చు. మద్యం కొనుగోలుచేస్తున్న వారిలో ఎక్కువ మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలేనన్న విషయం కూడా తాజా పరిణామాల్లో స్పష్టంగా అర్ధమవుతోంది.