రాష్ట్రీయం

చందన బ్రదర్స్ చైర్మన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: సంతకం ఫోర్జరీ చేసిన కేసులో చందన బ్రదర్స్ చైర్మన్ రామారావును హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు కన్నా ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నా ఫణీంద్ర నరుూం పేరుతో తనను బెదిరిస్తున్నాడంటూ బెదిరింపు లేఖతో చందన బ్రదర్స్ యజమాని రామారావు గతంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపగా సంతకం ఫోర్జరీ జరిగినట్టు తేలింది. ఫణీంద్ర సంతకం ఫోర్జరీ చేసి తనకు తాను బెదిరింపు లేఖ రాసుకుని రామారావు ఫిర్యాదు చేశారని పోలీసులు గుర్తించారు.