ఆంధ్రప్రదేశ్‌

కార్మికులను పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 23: రైల్వే కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు రైల్వే కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుతో అనేకసార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. మరోసారి ఇచ్చిన గడువు సైతం ముగుస్తున్నా కేంద్రం స్పందించకపోవడంతో భారతీయరైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ఇపుడు అమీతుమీకి సన్నద్ధమవుతుంది. రైల్వే పరిధిలోకి వచ్చే 17 జోన్లు, 66డివిజన్లకు చెందిన 13.70 లక్షల మంది ఉద్యోగులకు సమ్మె గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
వచ్చేనెల 1,2 తేదీల్లో రాయపూర్‌లో జరగనున్న ఎన్‌ఎఫ్‌ఐఆర్ సర్వసభ్య సమావేశాల్లో సమ్మెకు సంబంధించిన తుదినిర్ణయం తీసుకుంటున్నట్టు సమాఖ్య ఉపాధ్యక్షుడు కె.సత్యమూర్తి ప్రకటించారు. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కేడర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్మికులందరి దృష్టికి సమ్మె గురించి తీసుకువెళ్ళాల్సి ఉందన్నారు. ఏడవ వేతన సంఘం సిఫారసులు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవన్నారు. ఏళ్ళ తరబడి ఆయా కేటగిరీల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ చేయటం, కొత్త పోస్టులను సృష్టించడం, రైల్వేలో ప్రైవేటీకరణను నిలుపుదల చేయడం, విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటి సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఈ విధంగా 20 సమస్యలపై తాము గత రెండేన్నరేళ్ళు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూనే ఉన్నా, వీటికి కేంద్రం ఎటువంటి సమాధానం రాలేదన్నారు. ఇటీవల ఢిల్లీలో కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం జరిగిందని, ఇందులో రైల్వేశాఖామంత్రి సురేశ్‌ప్రభు, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య, చైర్మన్ డాక్టర్ జి.సంజీవరెడ్డి పాల్గొన్నారన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత రెండుసార్లు గడువు పూర్తయ్యిందని, అయినా కేంద్రం దిగిరాకపోవడంతో తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమ్మె అనివార్యం కాకముందే తగిన నిర్ణయం తీసుకుని రైల్వే కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.