రాష్ట్రీయం

సాంస్కృతిక రాజధానిగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 1: విశాఖ నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ ఉత్సవ్-2016ను స్థానిక ఆర్‌కె బీచ్‌లోని ప్రధాన వేదిక మీద ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంటా మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన నగరంగా విశాఖ గుర్తింపు పొందిందన్నారు. కైలాసగిరిపై తెలుగు మ్యూజియంను ఏర్పాటు చేసుకున్నామని, అలాగే రాజీవ్ స్మృతి భవన్‌లో నేదునూరి కృష్ణమూర్తి సంగీత భండాగారాన్ని నెలకొల్పుకున్నామని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుత నిర్మాణాలు విశాఖలో జరగనున్నాయని మంత్రి గంటా చెప్పారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1995లో ఈ ఉత్సవాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉత్సవాలు కనుమరుగయ్యాయని అన్నారు. విశాఖ సంస్కృతి, చరిత్రపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని అభిమానం ఉన్నందువలన తిరిగి ఈ ఉత్సవాలను ప్రారంభించారని చెప్పారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక కళాకారును ప్రోత్సహించడం కోసం విశాఖ ఉత్సవ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలియచేశారు. త్వరలో సినిమా పరిశ్రమ విశాఖకు రాబోతోందని ఆయన చెప్పారు.
chitram..
విశాఖ ఉత్సవ్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న
మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు