ఆంధ్రప్రదేశ్‌

బీసీలకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25:‘కాపులకు బిసి రిజర్వేషన్ల వర్తింపుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వడమేగాని అమలుకు నోచుకోలేదు. అయితే టిడిపి దీనికి కట్టుబడి ఉంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నందునే రిజర్వేషన్లు కల్పించదలిచామనీ, దీనివల్ల బిసిల రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బిసిలు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారని, మీరే పార్టీకి గుండెకాయ... ఊపిరి లాంటి వారన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన కల్లు గీత, కృష్ణ బలిజ, పూసల, మేదర సహకార ఆర్థిక సంస్థలకు నియమితులైన చైర్మన్‌లు, డైరెక్టర్ల పదవీ స్వీకార మహోత్సవం శుక్రవారం నాడిక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేళ్లుగా బిసి వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్‌ల పదవులు భర్తీ కాలేదని, తాను సిఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణంలోనే ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ఇప్పటికి తొమ్మిది కార్పొరేషన్లలో చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. తొలిసారిగా బిసి సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి దాని ద్వారా రూ.8,832 కోట్లు కేటాయించామంటే దీనివల్ల వివిధ పథకాల అమలుకు వీలవుతుందని, పైగా నిధులు దారి మళ్లే అవకాశం ఉండదన్నారు.
సభలో మంత్రులు కెఇ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ గీతం జయప్రకాష్ నారాయణ, మేదర కార్పొరేషన్ ఛైర్మన్‌గా టంగుటూరి యిల్లాల బాబు, కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కావేటి సామ్రాజ్యం ప్రమాణ స్వీకారం చేశారు.

చిత్రం... వెనుకబడిన వివిధ వర్గాల చైర్మన్లు, డైరెక్టర్లతో పదవీ ప్రమాణం చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు