రాష్ట్రీయం

అకాడమీలో మార్నింగ్ వాక్ అధికారులతో కలిసి యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్నింగ్ వాక్ చేశారు. అరగంట సేపు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత మోదీ అకాడమీలోని పరేడ్ మైదానంలో యోగా చేశారు. యోగా కార్యక్రమంలో పోలీసు డిజిపి, ఐజిపిలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి యోగాలో పాల్గొనడం జీవితంలో అద్భుతమైన రోజని, ఎప్పటికీ మర్చిపోలేమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి అన్నారు. మోదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై డిజిపిలు ఇచ్చిన ప్రజెంటేషన్‌లోని కీలకమైన సమాచారాన్ని శ్రద్ధగా వినడమే కాకుండా తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల డిజిపిలు సరిహద్దు ఉగ్రవాదంతో పాటు వివిధ వ్యవస్థీకృత నేరాలు, వాటిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం అందిస్తున్న సహకారం, ఆధునిక టెక్నాలజీని అమలు పరుస్తున్న తీరును వివరించినట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల డిజిపిలు వామపక్ష తీవ్రవాదం తదితర సమస్యలను వివరించినట్లు తెలిసింది.
తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు తమ రాష్ట్రాల్లో ఐటి, పోలీసింగ్ విధానాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉదయం నరేంద్రమోదీ అకాడమీలో ఉన్న సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐపిఎస్ అధికారుల స్మారకస్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ పోలీసు అకాడమీలో మోదీ శుక్రవారం రాత్రి బస చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా అధికారులు ఎప్పటికప్పుడు దేశ, విదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాని మోదీకి వివరించారు.

ఎంతో ఆనందాన్ని ఇచ్చింది
డిజిపిల సదస్సుపై ప్రధాని మోదీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్ నేషనల్ పోలీసు అకాడమీలో డిజిపిల సదస్సులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఆయన ట్వీట్‌లో డిజిపిల సదస్సుపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన డిజిపిలు, ఐజిలతో ఫలప్రదమైన మాటామంతి జరిగిందని, అనేక విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. పోలీసింగ్, టెక్నాలజీ, పోలీసుల నైపుణ్యం పెంపుదల తదితర అంశాలపై డిజిపిలు మాట్లాడారన్నారు.