ఆంధ్రప్రదేశ్‌

మోదీని కాల్చి పారేసినా పాపం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 27: ప్రధాని మోదీ సర్కార్ కార్పొరేట్ల లబ్ధి కోసమే పని చేస్తోందని, ప్రత్యామ్నాయం చూపించకుండా నోట్లను రద్దు చేయడం అత్యంత క్రూరమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీని నూటొక్కసారి కాల్చిపారేసినా పాపం లేదని నారాయణ అన్నారు. వెంకయ్య నాయుడు మోదీ భజన మానుకుని కళ్లు తెరవాలన్నారు. రైతులు, జన్‌ధన్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నోట్ల రద్దుపై ప్రజలు ఇచ్చిన ఆక్రోశ దినంగా బంద్ పాటిస్తున్నామని, ఈ బంద్‌లో బ్యాంకులకు మినహాయింపు ఉందని నారాయణ స్పష్టం చేశారు. మోదీ కార్పొరేట్లకు రూ.4 వేల కోట్లు రద్దు చేశారని, దేశంలో వున్న నల్లధనం బయటకు తేవడానికి ప్రజలందరిపై శిక్ష వేయక్కర్లేదన్నారు. ప్రజలు యాభై రోజులపాటు సహకరించాలని ప్రధాని మోదీ కోరుతున్నారని, వారిని యాభై రోజుల పాటు భోజనం మానేయగలరా అని డిమాండ్ చేస్తున్నామన్నారు. నల్ల కుబేరుల మేలు కోసం మోదీ చర్యలు చేపట్టారని ఆరోపించారు. నకిలీ నోట్లను అరికట్టలేక ప్రజలపై ఇటువంటి ప్రయోగాలు చేయడం చాలా దారుణమని, భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రధాని ఎవరూ లేరని ఆరోపించారు. కార్పొరేట్ల ఉప్పు తింటున్న మోదీ, వారి రుణం తీర్చుకుంటున్నారన్నారు. జిఎస్‌పిసి వంటి సంస్థలకు వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. పరిమిత వ్యక్తులకే నోట్ల రద్దు లీకయిందని ఎద్దేవా చేశారు. పాత నోట్లు చలామణిలో ఉండగానే కొత్త నోట్లు ప్రవేశపెడితే బావుండునన్నారు. ఇపుడు కరువు దాడులు కాదు కరెన్సీ దాడులుగా పరిస్థితి మారిపోయిందన్నారు. రానున్న ఆరు నెలల వరకు ఈ పరిస్థితి కుదుటపడే పరిస్థితి లేదన్నారు.