రాష్ట్రీయం

పడిపోయిన ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సాధారణ కనీస ఉష్ణోగ్రతతో పోలిస్తే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో 12.9 నుండి 12 డిగ్రీలుగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రతలు మరింత గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల, రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి, ఆదిలాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్, కొమరంభీం, భద్రాచలం, జయశంకర్ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 నుండి 11 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని సమాచారం అందింది. ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు చలిగాలులు వీస్తున్నాయని ఐఎండి డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. జలాశయాలు ఉన్న ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పెరిగి చలి ఎక్కువగా ఉంటోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం పెద్దగా ఉండటం లేదు.
హోదా కంటే
ఎక్కువే ఇస్తున్నాం
బిజెపి నేత రఘునాథ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నదని ఎపి బిజెపి సీనియర్ నాయకుడు రఘునాథ్ బాబు తెలిపారు. కాబట్టి ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతాన్ని విశ్వసించరాదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను కోరారు. పెద్దనోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేయడంపై ప్రతిపక్షాలు సోమవారం నిరసనకు పిలుపునివ్వడం, ఆందోళనలు చేపట్టాలనుకోవడం దారుణమని అన్నారు. నల్లధనాన్ని వెలికి తీయడాన్ని స్వాగతిస్తామని విపక్షం ఓవైపు చెప్తూనే ఆందోళనలకు పిలుపునివ్వడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది కలిగినా, రాబోయే రోజుల్లో మేలు జరుగుతుందని అన్నారు.