రాష్ట్రీయం

ఉగ్రవాదం ఉనికి పోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో తీవ్రవాదం, ఉగ్రవాదం ఉనికి కోల్పోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం నల్లకుబేరులకు శరాఘాతంగా మారిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డిజిపిల సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల నగదు లావాదేవీలు, చలామణి నిలిచిపోయి తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఈ అక్రమ, నల్లధనంతోనే వారు కార్యకలాపాలను తీవ్రతరం చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు అనేకమంది లొంగిపోతున్నారని ఆయన చెప్పారు. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రద్దు చేసిన నోట్లను పెట్రోలు బంకుల్లో, ఆసుపత్రుల్లో తీసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని, బ్యాంకుల్లో, ఎటిఎంలలో, పోస్ట్ఫాసుల్లో డబ్బులు డ్రా చేసేందుకు, రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా, రానున్న 50 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. నోట్ల రద్దుకు తెలంగాణ ప్రజలు బాగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన డిజిపిల సదస్సులో రాబోయే రోజుల్లో డిజిటల్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై చర్చించినట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇ-చలాన్‌పైనా చర్చించినట్లు చెప్పారు.

బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆహిర్, పక్కన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్