ఆంధ్రప్రదేశ్‌

నగదు రహితంగా వంటగ్యాస్ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 27: వంట గ్యాస్ సిలెండర్లను ఇక నుండి నగదు రహిత బదిలీ ప్రక్రియ ద్వారానే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలో చకచగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలెండర్లు సరఫరా చేసే ఎల్‌పిజి డీలర్లు విధిగా నగదు రహిత బదిలీని పాటించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని సుమారు 13 లక్షలమంది గ్యాస్ వినియోగదారులకు ఇకపై నగదు బదిలీ ద్వారానే వంట గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కచ్చితమైన ధరకే వినియోగదారుడి ఇంటికి గ్యాస్ సిలెండర్ చేరే అవకాశం కూడా ఉంది. అంటే గ్యాస్ డెలివరీ బాయ్‌ల చేతివాటానికి తెర పడనుంది. సిలెండర్‌కు సరిపడే మొత్తాన్ని మాత్రమే ఈ-పోస్ మిషన్ ద్వారా స్వైప్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడంతో డెలివరీ బాయ్ వినియోగదారుడి నుండి అదనంగా చిల్లర డిమాండ్ చేసే అవకాశం ఉండదు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. 500, 1000 నోట్ల రద్దుతో మనీ సర్క్యులేషన్ అనూహ్యంగా తగ్గడంతో మార్కెట్‌లో కొనుగోళ్ళు, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా నగదు రహిత బదిలీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అన్ని అంశాల్లో నూరు శాతం నగదు రహిత బదిలీ ప్రక్రియను అమలుచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 13 లక్షల గ్యాస్ వినియోగదారులున్నారు. ఆధార్ అనుసంధానంతో వినియోగదారుల వివరాలను బ్యాంకు ఖాతాలకు సీడింగ్ చేశారు. దీంతో నగదు బదిలీ ద్వారా ప్రతిఒక్కరికీ గ్యాస్ సిలెండర్లు అందించేందుకు మార్గం సుగమమైంది. ఎల్‌పిజి డీలర్లు ఈ-పోస్ యంత్రాల ద్వారా ఆంధ్రాబ్యాంకుకు సంబంధించిన బిజిలీ యాప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బడ్డీ యాప్ తదితర యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. నెట్ కనెక్టివిటీ ద్వారా వీటిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు జిల్లాలో సిలెండర్లు అందించే డెలివరీ బాయ్స్‌కు యాప్‌లు, స్వైప్‌లపై తగిన అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.