రాష్ట్రీయం

అందుబాటులోనే ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే (తెలంగాణలో) ఉండిపోవాలని ఉంది అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనసు ఇక్కడేవున్నా, అక్కడ (ఏపీలో) బాధ్యతలు ఉన్నాయన్నారు. ఆదివారం తెలంగాణ తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు సుమారు 10 నెలల తర్వాత ఎన్టీఆర్ భవన్‌లో అడుగుపెట్టారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం అమర్‌నాథ్ బాబు, ఇతర నేతలు సాయిబాబు, ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఎప్పటిలా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలదండవేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ హయాంనుంచీ ప్రతి సమావేశం ప్రారంభానికి ముందు ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ పాట ఆడియో పెట్టడం, అందరూ నిలుచోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం కూడా సభ ప్రారంభానికి ముందు ఆ పాట పెట్టడంతో అందరూ లేచినిలబడ్డారు. తర్వాత అమర్‌నాథ్ బాబు, ఎల్ రమణ, రేవంత్, మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడిన అనంతరం చంద్రబాబు తన ప్రసంగంతో పార్టీ యంత్రాంగంలో హుషారు తెచ్చే ప్రయత్నం చేశారు. మీ అందరి అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండాలని ఉంది. అయితే అక్కడి (ఏపీ) ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారు. ఆ బాధ్యతను విస్మరించలేను అన్నారు. ఏపీకంటే బలమైన నాయకత్వం తెలంగాణలో ఉందనడంతో పార్టీ నేతలు కరతాళధ్వనులు చేశారు. పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలని, తాను పూర్తిగా అండగా ఉంటానని చెప్పారు. పార్టీ నేతలు కొందరు తనను నెలకు ఒక్క రోజైనా తెలంగాణకు కేటాయించాలని కోరారని, అయితే అంతకంటే ఎక్కువ సమయమే కేటాయిస్తానని చెప్పి వారికి ధైర్యం కల్పించే యత్నం చేశారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేశామని, ఇలా చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే రెండు లక్షల ఆర్థిక సాయం నిధినుంచి అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో ఏపీలో 5 లక్షలతో చంద్రన్న భీమా ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు.
సభ్యత్వంలో మధిరకు ఫస్ట్ ర్యాంక్
టి.టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెలాఖరు వరకు నిర్వహించనుంది. అయితే మరో 10 రోజులపాటు పెంచాలని పార్టీ నాయకులు కోరారు. ఇప్పటి వరకు 32 లక్షలకు పైగా సభ్యత్వం జరిగిందని, ఇందులో మధిర నియోజకవర్గం మొదటిస్థానంలో ఉందని, రెండోస్థానంలో దేవరకద్ర నియోజకవర్గం ఉందని మాజీ మంత్రి ఇ పెద్దిరెడ్డి తెలిపారు.
కోతులకు ఇచ్చినట్టుంది..: రేవంత్
టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం కొతులకు ఇచ్చినట్టుందని విమర్శించారు. 19 ఎకరాల్లో ముఖ్యమంత్రి తన సొంతానికి 9 ఎకరాల్లో విలాసవంతమైన 150 గదుల గడిని నిర్మించుకున్నారని, మిగతా ఎకరాల్లో కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భవనాలు నిర్మించారని తెలిపారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత 16మంది సిఎంలు 69 వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తే, కెసిఆర్ లక్షా 25 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టిడిపిని ఆంధ్ర పార్టీ అంటే సహించేది లేదని, టిడిపి తెలంగాణలోనే పుట్టిందని అన్నారు. త్వరలో మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలకూ పార్టీని విస్తరించనున్నట్లు వెల్లడించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే తమస్థాయి తగ్గించుకున్నట్టే అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సభకు అధ్యక్షత వహించిన టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తమకు ధైర్యాన్ని నూరిపోయాలని చంద్రబాబును కోరారు. సిఎం కెసిఆర్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్ని జన్మలెత్తినా ఇటువంటి నాయకుడు లభించరన్నారు. చంద్రబాబు నెలకు ఒకసారైనా పార్టీకి సమయం కేటాయించాలని, బాబువస్తే ‘టానిక్’ ఇచ్చినట్టే అవుతుందన్నారు. పార్టీ తెలంగాణ నేతలు ఎవరి దారిన వారు వెళ్ళకుండా అందరినీ కలుపుకుని పోవాలన్నారు. తెలంగాణలో పెత్తందార్ల రాజ్యం రాకూడదంటే మీరు సమయం కేటాయించాలని కోరారు. తెలంగాణ సిఎం కెసిఆర్ రంగుల వలయంలో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.

చిత్రం... తెలంగాణ టిడిపి విస్తృతస్థాయ సమావేశంలో వేదికపై నేతలతో మాట్లాడుతున్న
పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు