ఆంధ్రప్రదేశ్‌

మనకున్నది దౌర్భాగ్య ప్రతిపక్ష నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, అటు కృష్ణా డెల్టాలకు గోదావరి జలాలను అందించడం వల్ల రూ.250 కోట్ల విలువైన పంట దక్కిందని, అటువంటి ప్రాజెక్టయిన వట్టిసీమను విమర్శించిన నాయకులు ఇపుడు ఏమంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని అన్నారు. ఉత్తమ కుమార ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం దౌర్భాగ్యమని విమర్శించారు. అనేక కేసుల్లో ఎ 1గా వున్న జగన్, ఎ2గా వున్న విజయ్ సాయిరెడ్డిని వెనుకేసుకుని తిరుగుతూ జైల్లో ఊచలు లెక్కపెట్టేందుకు తోడు కోసం వెంపర్లాడుతున్నారని, జైలు జీవితానికి తోడు కోసం అతన్ని రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ చేశారని ఆరోపించారు. విజయ్‌సాయిరెడ్డిని వైఎస్ సిఎంగా ఉండగా ఆర్‌బిఐ డైరెక్టర్ పోస్టుకు ప్రతిపాదించగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పక్కనబెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు.
తొమ్మిది నెలల్లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారన్నారు. పులవెందులకు కొత్త సంవత్సరంలో గాలేరు నగరి ద్వారా నీరిస్తామని చెప్పారు. హద్రీనివా ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి కానుందని హిందూపురానికి సాగునీరు అందిస్తామన్నారు. 2017లో కుప్పంకు నీరిస్తామని వివరించారు. ఈ రెండున్నరేళ్ళ కాలంలో జల వనరులకు రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.16వేల కోట్లు నాబార్డు ద్వారా కేంద్రం ఇస్తోందన్నారు. సమావేశంలో మేయర్ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.