రాష్ట్రీయం

ఇక ఆసుపత్రుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 1: పేదలకు ఆరోగ్యం అందించటమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, తాను పేదల కోసమే ముఖ్యమంత్రిగా ఉన్నానని ఏ కొందరి కోసమో కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ ఏడాది పూర్తిస్థాయిలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, పేదలకు సేవలు అందించడానికి అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన వ్యవస్థ ముందుకు సాగుతోందన్నారు. త్వరలోనే 500మంది వైద్యులను, వెయ్యిమంది నర్సులను నియమిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం, 102 వాహనాలు, తల్లిబిడ్డ ఆసుపత్రి, కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఏడాది పేదల ఆరోగ్యం విషయంలో తన లక్ష్యాలను వివరించారు. ముందస్తుగా ఆసుపత్రుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఇంతకుముందు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య వ్యవస్థపై దృష్టిపెట్టి, ఫలితాలు కూడా రాబట్టానని, అయితే గత పదేళ్లలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయిందన్నారు. పరికరాలు ఉంటే వైద్యులు లేక, వైద్యులున్నచోట పరికరాలు లేక, రెండూ ఉంటే పరికరాలు పనిచేయక, చివరకు పేద, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య సేవలు అందకుండా పోయాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగపడిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తగిన పరిష్కారాల కోసం అనే్వషించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల వ్యవస్థను క్రమబద్ధీకరించటం, పేదలకు సేవలు అందించేలా మార్పులు చేపట్టామన్నారు. దీనిలోభాగంగానే ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం, 102 కాల్‌సెంటరు, వాహనాల ఏర్పాటు వంటివి చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో పిహెచ్‌సి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు అన్నిస్థాయిల్లో ఈ పథకాల్లో సేవలందుతాయన్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతిపై పెనుభారం తగ్గుతుందన్నారు. వైద్యులు కూడా క్రమశిక్షణతో అంకితభావంతో సేవలందించడం కోసం ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. వైద్యులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సిందేనన్నారు. అలాకాకపోతే నిరభ్యంతరంగా వారు ఎన్నుకున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరవచ్చునని స్పష్టంచేశారు. ఏళ్ల తరబడి సెలవుపెట్టి, మళ్లీ ఉద్యోగాల్లో చేరే విధానాలకు స్వస్తి చెప్పామని, ఆరునెలలు దాటితే ఇక అనుమతిచ్చేది లేదన్నారు. త్వరలోనే అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రులకు పరిపాలనాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. మంత్రులు డాక్టరు కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, విప్‌లు అంగర రామ్మోహన్, చింతమనేని ప్రభాకర్, ఎంపిలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కలెక్టరు కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.