ఆంధ్రప్రదేశ్‌

విపత్తులకు ట్రాన్స్‌కో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: విపత్తులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సన్నద్ధమైంది. ఇందులో భాగంగా పది భారీ విద్యుత్ టవర్లను సమకూర్చుకుంది. వీటిని అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకురాగా, అక్కడ నుంచి విశాఖ కలపాకలో ఉన్న 400 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తరలించారు. ఎమర్జెన్సీ రెస్టోరింగ్ సిస్టమ్ (ఇఆర్‌ఎస్) కింద అవసరమైన చోట్ల, దెబ్బతిన్న టవర్లను తొలగించి ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చిన భారీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అప్పటికపుడే యుద్ధప్రాతిపదికన ఈ టవర్లను ఏర్పాటు చేయడం వలన విద్యుత్ సరఫరా మెరుగుపర్చినట్టు అవుతుంది. పరిశ్రమలు, వాణిజ్య, గృహాలకు సైతం ఎటువంటి విద్యుత్ అంతరాయాలు ఉండవు. విద్యుత్ నష్టాలను తగ్గించుకునే వీలుంటుంది. 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖలో సంభవించిన హుదూద్ తుపాను అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీ ట్రాన్స్‌కో కాస్తంత ముందుగానే భారీ విద్యుత్ టవర్లను సమకూర్చుకోగలిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాలో తయారైన భారీ విద్యుత్ టవర్లను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన మూడు జోన్లకు తరలించారు. విశాఖపట్నం జోన్ పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రూ.26 కోట్లతో కొనుగోలు చేసిన పది భారీ విద్యుత్ టవర్లు ఇక్కడకు చేరుకోగా, కడప జోన్‌కు సంబంధించి రూ.26 కోట్లతో కొనుగోలు చేసిన మరో పది విద్యుత్ టవర్లు అనంత్‌పూర్ ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. విజయవాడ జోన్ పరిధిలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే ఉన్నందున అదీ సముద్ర తీర ప్రాంతాలు లేకపోవడంతో రాష్ట్రంలో అవసరమైన ఆయా జిల్లాలకు వీటిని తరలించేందుకు వీలుగా సిద్ధం చేశారు. సముద్ర పరీవాహాక ప్రాంతాలు, సమీపంలో ఉండే మండల కేంద్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తుపాన్లు, సునామీ, భూకంపాలు వంటివి సంభవిస్తే మొట్ట మొదట విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లో అత్యవసరంగా మెరుగుపర్చేందుకు ఇఆర్‌ఎస్ విధానం ద్వారా భారీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తుంటారు. హుదూద్ సమయంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారం రోజుల పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన రెండు వేల మంది విద్యుత్ సిబ్బంది రేయింబవళ్ళు శ్రమపడి చివరకు నేవీ హెలికాప్టర్ల సహాయంతో సింహాచలం గిరిపైన, పరిసరాల్లో భారీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసి, సరఫరా పునరుద్ధరణకు సహకరించారు. అదే తరహాలో విపత్తులు సంభవిస్తే ఎదుర్కొనేందుకు వీలుగా నవంబర్, డిసెంబర్‌ల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులు, బ్రేక్‌డౌన్లను అధిగమించడం వంటి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో సాంకేతిపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.